యాడసూడు కళ్ళల్లో నువ్వే
ఈ మధ్య కాలంలో అబ్బాయిల లవ్ ఫెయిల్యూర్ పాటలు ఈ తరం కుర్రకారును ఏ విధంగా అలరిస్తున్నాయో మనందరికీ తెలిసిందే. లవ్లో ఓడిపోతే వాళ్ళ హృదయం పగిలిపోయి ముక్కలై ఆ వేధన రొధనలా మారి వారి మనసులో ఉన్న ఆ అమ్మాయి ప్రతిరూపాన్ని చెరిపేసుకోలేక నేను లవ్లో ఓడిపోయాను...అని చెప్పుకుంటే తనని ఎలా చూస్తుందో ఈ సమాజం అని ఎవరికీ చెప్పుకోలేక వారు పడే నరకయాతన అంతా ఇంతా కాదు.కాని కొందరు అమ్మాయిలు కూడా ఇలాంటి సందర్భాన్ని ఎదురుకోక తప్పదు.
వారిలో కూడా సిన్సియర్గా లవ్ చేసే వారు ఉంటారు. మరి వారు లవ్ ఫెయిలైతే వారిలో కూడా బాధపడేవారు ఉంటారు.
లవ్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా ముందు ప్రేమించాలి.ప్రేమ అనేది ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని చూసి సెలక్ట్ చేసుకుని కులం చూసి మతం చూసి ధనం చూసి పుట్టేది కాదు.గర్వాన్ని అహంకారాన్ని, అజమాయిషీని చూసి జడుచుకునేది అంతకన్నా కాదు.అది ఎవరో విడదీస్తే విడిపోయేది కాదు. చనిపోయేది అసలే కాదు.అది కళ్ళకు కనిపించదు చెవులకు వినిపించదు మనసుకు మాత్రమే కనిపిస్తుంది వినిపిస్తుంది.ఇదంతా ప్రేమించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రేమించినవారు భగ్న ప్రేమికులైనా అయ్యుండాలి,బాధను భరించేవారైనా అయ్యిండాలి.
తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళకు కనిపిస్తే తనలోని భావాలని ఆ అమ్మాయికి వ్యక్త పరచాలని అనుకునే మాటలు పాట రూపంలో చెపుతున్నాడు. ఆ అమ్మాయి ఊహల నుండి తప్పించుకోలేక తనలో తాను సతమతమౌతు తన ప్రేమని మాట కాని పాట రూపంలో చెబుతూ...
ఆ ప్రేమని వ్యక్తపరిచే విధానం కవి తన పెన్నులో పొందుపరచి హృదయవిధారకంగా కాకుండా చాలా సరసమైన పదాలు వాడి జానపద రీతిలో ఆ అబ్బాయి మనసులోని భావాలను చాలా సులువైన మాటలను చమత్కారంగా పొందుపరచి మనకందించిన విధానం చాలా బాగా కుదిరింది.ఇది ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు విశ్వనేత్ర స్టూడియో యాజమాన్యం.
అలాగే తెలుగు భాషని మరచిపోతున్న రోజులివి అందుకే అచ్చ తెలుగులో పాటలు రాసి మీ అందరి ముందు ఉంచుతామని, ఆ తెలుగులో తియ్యదనం మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానెల్ ని ప్రారంభించటం జరిగింది.మన ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసి మీరందరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ... విశ్వనేత్ర స్టూడియో యూట్యూబ్ ఛానెల్ వారు కోరుకుంటూ... ప్రేక్షకులందరికీ నమస్కారంచెపుతూ ఈ పాటని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
Devotional
Comments
Post a Comment