Skip to main content

Posts

Featured

యాడసూడు కళ్ళల్లో నువ్వే

యాడసూడు కళ్ళల్లో నువ్వే యాడసూడు కళ్ళల్లో నువ్వే ఈ మధ్య కాలంలో అబ్బాయిల లవ్ ఫెయిల్యూర్ పాటలు ఈ తరం కుర్రకారును ఏ విధంగా అలరిస్తున్నాయో మనందరికీ తెలిసిందే. లవ్లో  ఓడిపోతే వాళ్ళ హృదయం పగిలిపోయి ముక్కలై ఆ వేధన రొధనలా మారి వారి మనసులో ఉన్న ఆ అమ్మాయి ప్రతిరూపాన్ని చెరిపేసుకోలేక నేను లవ్లో ఓడిపోయాను...అని చెప్పుకుంటే తనని ఎలా చూస్తుందో ఈ సమాజం అని ఎవరికీ చెప్పుకోలేక వారు పడే నరకయాతన అంతా ఇంతా కాదు.కాని కొందరు అమ్మాయిలు కూడా ఇలాంటి సందర్భాన్ని ఎదురుకోక తప్పదు. SriHari das (Instagram) వారిలో కూడా సిన్సియర్గా లవ్ చేసే వారు ఉంటారు. మరి వారు లవ్ ఫెయిలైతే వారిలో కూడా బాధపడేవారు ఉంటారు. లవ్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా ముందు ప్రేమించాలి.ప్రేమ అనేది ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని చూసి సెలక్ట్ చేసుకుని కులం చూసి మతం చూసి ధనం చూసి పుట్టేది కాదు.గర్వాన్ని అహంకారాన్ని, అజమాయిషీని చూసి జడుచుకునేది అంతకన్నా కాదు.అది ఎవరో విడదీస్తే విడిపోయేది కాదు. చనిపోయేది అసలే కాదు.అది కళ్ళకు కనిపించదు చెవులకు వినిపించదు మనసుకు మాత్రమే కనిపిస్తుంది వినిపిస్తుంది.ఇదంతా ప్రేమించిన వారికి మాత్రమే తెలుస్తుంది

Latest Posts